ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని రోలుగుంట మండలం వైకాపా అధ్యక్షుడు బొడ్డు అప్పలనాయుడు పేర్కొన్నారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం కర్లపూడిలో రాజధాని సంబరాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాదుతో ధీటుగా పోటీపడే నగరాల్లో విశాఖపట్నం ఒకటని మండల పార్టీ అధ్యక్షుడు అప్పలనాయుడు పేర్కొన్నారు. అందుకే విశాఖను అభివృద్ధి చేయటం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారిస్తున్నారన్నారు. ఈ విషయాలన్నీ ప్రతిపక్షాలు విమర్శించటం తగదని అప్పలనాయుడు అన్నారు.
ఇదీ చూడండి