ముఖ్యమంత్రి జగన్ దయవల్లే తెదేపా ఇంకా బతికుందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. సీఎం ఒప్పుకుంటే వైకాపాలోకి చేరేందుకు తెదేపా ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. తెదేపా హయాంలోని ప్రతి స్కాం వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని వీరభద్రరావు ఆరోపించారు. తెదేపా నేతల అరెస్టులతో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తప్పు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి 'వైకాపా కండువా కప్పుకుంటే కోట్లు... లేదంటే కేసులు'