లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తే తమపై తప్పుడు కేసులు పెట్టడం తగదని ఆర్ఈసీఎస్ మాజీ ఛైర్మన్, వైకాపా నేత బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు అనకాపల్లి డీఎస్పీ శ్రావణికి వినతిపత్రం అందజేశారు. దీనిపై తగిన విచారణ చేయాలని కోరారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పేదలకు నిత్యావసరాలు అందజేస్తుంటే కొంతమంది తనపై అనవసరంగా ఫిర్యాదు చేశారని వాపోయారు. తాను వ్యక్తిగత దూరం పాటిస్తూనే సరుకులు అందించానని వివరించారు.
ఇదీ చూడండి..