విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన వరహాలమ్మ అనే మహిళ పాముకాటుకు గురై మృతి చెందింది. వరహాలమ్మ తమ గ్రామానికి సమీపంలో పశుగ్రాసం కోయడానికి ప్రయత్నిస్తుండగా సమీపంలో ఉన్న పాము ఒక్కసారిగా కాటు వేయడంతో సొమ్మసిల్లి పడిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను బంధువులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చారు. అయితే అప్పటికే వరహాలమ్మ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి..