ETV Bharat / state

'అంతుచిక్కని వ్యాధితో గిరిజనులు మరణిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు '

విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధులతో గిరిజనులు చనిపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని భాజపా నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు పాడేరు ఐటీడీఏ పీవో ఛాంబర్ వద్ద బైఠాయించారు. అనంతరం మృతులకు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.

'అంతుచిక్కని వ్యాధితో మరణిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు '

author img

By

Published : Oct 24, 2020, 6:08 PM IST

విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మ కోట పంచాయతీ శంకుపర్తిలో వింత వ్యాధితో నలుగురు మృత్యువాత పడ్డారని భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేతలు గ్రామంలో పర్యటించారు. ఊళ్లో నెలకొన్న పరిస్థితులపై ఫోన్​లో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

వారికి పరిహారం ఇవ్వాలి..

గ్రామంలో వెంటనే మెరుగైన వైద్య శిబిరం ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని అరకులోయ పార్లమెంట్ భాజపా నేత పాంగి రాజారావు, ఎస్టీ విభాగం మోర్చా పాడేరు అధ్యక్షుడు కురుస ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ పీవో ఛాంబర్ వద్ద బైఠాయించారు.

అధికారులకు చిత్తశుద్ది ఏదీ ?

గిరిజనుల ఆరోగ్యంపై అధికారులకు చిత్తశుద్ధి లేదంటూ నినదించారు. ఓ బాలిక సంకుపర్తిలో అంతు చిక్కని వ్యాధితో చనిపోయిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజనులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన దురాగతం...పసితనంలోనే పసుపుతాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.