విశాఖ జిల్లా అనకాపల్లిలో జనవరి 30వ తేదీన గంజాయి తరలిస్తూ తప్పించుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అనకాపల్లిలో గత నెల 30న మాటు వేశారు. విషయం తెలుసుకున్న నిందితులు పోలీసు వాహనాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించినప్పటికీ నిందితులు దొరకలేదు. సరుకు ఉన్న వ్యాన్ను వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. 640 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. ఇవాళ నిందితులను పట్టుకున్నారు. దొరికిన సరకు విలువ రూ.33 లక్షలు ఉంటుందని సీఐ భాస్కర్రావు తెలిపారు.
ఇదీ చూడండి: