వాయవ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగ మధ్య తీరం దాటినా.. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటలపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. తీరం వెంబడి బలమైన గాలులు కొనసాగుతాయని విశాఖ తుపాను హెచ్చరిక ల కేంద్రం అధికారి వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి జిల్లా చింతూరులో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరరామచంద్రాపురం, కూనవరంలో 13 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా కొయిడాలో 14, వెలేరుపాడులో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ జిల్లా పాడేరులో 12, నర్సీపట్నంలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి.