water man rajendra singh: అద్భుత జల వనరులున్న ఉత్తరాంధ్రలో నది జలాలు కాలుష్యమయ్యాయని.. వాటర్ మెన్, పర్యావరణ వేత్త డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు పెరగడం, వ్యర్ధ జలాలు నది జలాల్లో కలవడం వల్ల.. నీటి కాలుష్యం పెరుగుతోందన్నారు. విశాఖ జిల్లాలో పుట్టిన శారదా నది.. రసాయనాలతో కాలుష్యం అవుతోందన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే ప్రమాదకర రసాయనాలు నదిలో కలుస్తున్నాయని ఆవేదన చెందారు. శారదా నది 8 నియోజకవర్గవర్గాలకు నీరు అందిస్తోందని.. ఆ నదిని సంరక్షించకుంటే భవిష్యత్ తరాలకు చాలా నష్టం వాటిల్లుతుందన్నారు. నదుల కాలుష్యానికి కారణం ప్రభుత్వమని.. రసాయనాలు ఎక్కువగా కలుస్తున్నా వ్యవస్థలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శారదానదిని తవ్వేసి ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రాలో ఉన్న నదులన్నీ నాశనమవుతున్నాయని.. అధ్యయనంలో తేలిందన్నారు. నేషనల్ ట్రైబ్యునల్.. పర్యావరణం, నదుల సంరక్షణ చూడాలి కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు.. నదుల పరిరక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి వనరులు గుర్తించాలన్నారు.
ఇదీ చదవండి: APMDC : ఏపిఎండిసి ద్వారా ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి -విసిఎండి వెంకటరెడ్డి