విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధాన వనరు. జలాశయాలు, చెరువులపై ఆధారపడి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటం.. వర్షాలు కురవకపోవటం.. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎండ వేడిమికి.. సాగునీటి చెరువులు అడుగంటిపోతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో అయితే చెరువుల్లో చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. మెట్ట ప్రాంతాల్లో చెరువుల్లో తాగడానికి నీరులేక పశువులు ఇబ్బందులు పడుతున్నాయి. పొలాల్లో పచ్చదనం కనిపించటం లేదంటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో అప్పుడప్పుడు చినుకులు పడుతున్నా.. ఆశించినంత వర్షం పడకపోవటం.. రైతులు వర్షాలు కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇవీ చూడండి… కరోనా మార్చిన పరిస్థితులు... రద్దీగా మారిన శ్మశానాలు!