అమెరికాలో తెలుగు విద్యార్థి సుమేద్ స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు క్రెటర్ సరస్సుకు వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తనతోపాటు ఇద్దరు స్నేహితులతో క్రెటర్ సరస్సుకు వెళ్లినట్లు తెలుస్తుంది. సరస్సులోకి వెళ్లిన కాసేపటికే ఈతరాక మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత విశాఖలో ఉంటున్న సుమేద్ తల్లిదండ్రులకు అక్కడి పోలీసులు సమాచారం అందించారు. కాగా మృతుడు తండ్రి ఎం.ఎస్.కుమార్ స్టీల్ ప్లాంట్ క్రీడల శాఖ డీజీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇది చూడండి: పాక్‌లోని మసీదులో భారీ పేలుడు- ఐదుగురు మృతి