ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని సుప్రీం కోర్టు చెప్పడంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి.. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని విశాఖ జిల్లా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. చాలాకాలం నుంచి ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వలన బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. విశాఖ జిల్లా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి..