ETV Bharat / state

తాండవ జలాశయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

author img

By

Published : Aug 20, 2020, 5:21 PM IST

విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అనంతరం నాడు-నేడు పనులను పరిశీలించారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

vizag district collector inspected thandava  Reservoir
వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్

విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయాన్ని.. కలెక్టర్ వినయ్​చంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... 2 రోజుల క్రితం 379 అడుగులకు నీరు చేరింది.

ఫలితంగా అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మండలంలో నాడు-నేడు పనుల తీరును పరిశీలించారు. నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయడానికి వీలుగా ప్రణాళికలు వేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఇదీ చదవండి:

చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో 9 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.