విశాఖ జిల్లా మాడుగుల మండలం కె.జె.పురం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నేత బొడ్డేడ రామారావు (80) శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయ జీవితం తొలినాళ్లలో కె.జె.పురం గ్రామ వార్డు సభ్యుడిగా మొదలైంది. గ్రామ సర్పంచిగా, మాడుగుల సమితి అధ్యక్షుడిగా.. విశాఖ జిల్లా పరిషత్ ఛైర్మన్, చోడవరం (గోవాడ) చక్కెర కర్మాగారం ఛైర్మన్ గా... అనేక పదవులు చేపట్టారు. శనివారం మాడుగుల మండలం కె.జె.పురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి