విశాఖ జిల్లా చోడవరం మండలం రాయపురాజుపేట వద్ద ఊటగెడ్డపై ఉన్న కల్వర్టు.. 2015 నాటి భారీ వర్షాలకు కూలిపోయింది. ఆ తర్వాత చేపట్టిన తాత్కాలిక పనులు కూడా.. గెడ్డ ప్రవాహానికి దెబ్బతిన్నాయి. ఇక అధికారులు కానీ.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు తెలిపారు. రహదారి మార్గం లేక గ్రామస్థులే గెడ్డలో దారికి అనువుగా బాట చేసుకున్నారు.
చోడవరం, కె.కోటపాడు మండలాలకు చెందిన గ్రామస్థులు ఈ కల్వర్టు మీదుగా ప్రయాణించే వారు. పండించిన చెరకు గోవాడ చక్కెర కర్మగారానికి తరిలించేందుకు మార్గంగా ఉపయోగపడేది. కల్వర్టు పునరుద్ధరణ చేయని కారణంగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా.. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: