అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతి కావడం పట్ల.. హిందూ దేవాలయాలపై దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న తొలి మెట్టువద్ద విశ్వహిందూ పరిషత్ నిరసన వ్యక్తం చేసింది. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో త్రినాథరావుకు వినతిపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా హిందువులపై దాడిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో జిల్లా విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'సరైన నిఘా లేనందునే మోసాలు జరుగుతున్నాయి'