విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని 9వ వార్డు సింహాద్రి నగర్ సామాజిక భవనంలో ఒకే చోట రెండు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ఏర్పాటు చేయటంలో ఓటర్లు అయోమయానికి గురయ్యారు. తమ బూత్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు అవస్థలు పడ్డారు.
నగరం నడిబొడ్డున ఉన్న సింహాద్రి నగర్‌ను కొంత భాగం తూర్పు నియోజకవర్గంలోనూ... మరి కొంత భాగం బీమిలి నియోజకవర్గంలో విలీనం చేశారు. సుమారు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో తమను కలపటం ఎంతవరకు సమంజసమని సింహాద్రి నగర్ వాసులు ప్రశ్నించారు. ఎన్నికల కమీషన్ దృష్టికి స్థానిక నేతల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా తమ గోడు వినిపించుకునే నాథుడే లేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.
ఇవీ చూడండి.