రాష్ట్రంలోనే విశాఖ జిల్లాలో అత్యధికంగా టాక్సీ, ఆటో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ సాయం పదివేల రూపాయలు అందించినట్టు జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ సీ.జీ రాజారత్నం వెల్లడించారు. మొత్తం 24 వేల మందికి పైగా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ అయ్యిందన్నారు. ఫిర్యాదులు కేవలం 90 వరకే వచ్చాయని, బ్యాంకు ఖాతాల వివరాలను తప్పుగా నమోదు చేసుకోవడం వంటి కారణంగా... ఇవి జమ కాలేదని అన్నారు. ఈ తప్పిదాలను సరి చేసుకోవడానికి అవకాశంతో పాటు, కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకూ ఈ నెల 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.
ఇదీ చూడండి