పాడేరు ఘాట్ రోడ్డులోజీపు వ్యాను ఢీ... డ్రైవర్‌కు తీవ్రగాయాలు విశాఖ పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. జీపు-వ్యాన్ డీకొనటంతో వ్యాన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఆ సమయంలో అటుగా వస్తున్న పాడేరు సబ్ కలెక్టర్ స్పందించి ట్రాపిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. బాధితుడిని జీపులో మాడుగుల ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. ఇవీ చూడండి-పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ చోరీలు చేస్తోన్న మహిళ అరెస్టు