గ్రామ కంఠం భూములు అమ్మకాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా పాయకరావుపేటలోని కొర్లయ్యపేట గ్రామానికి చెందిన మత్య్సకారులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తమ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతూ మత్స్యకార కుటుంబాలను బెదిరింపులకు గురి చేస్తున్నారని... మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు ఆవేదన చెందారు. పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చదవండి: