ETV Bharat / state

విశాఖ జోన్​ విధివిధానాల ప్రక్రియ షురూ..!

దక్షిణ-కోస్తా కొత్త రైల్వే జోన్​ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభమైంది. ఈ విషయమై ఓఎస్డీ ఎస్​. ఎస్​. శ్రీనివాస్​ దక్షిణ మధ్య రైల్వే, తూర్పు-కోస్తా జోన్​ ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశమయ్యారు. నేడు రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో దిల్లీలో సమావేశం కానున్నారు. విధివిధానాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్​)ను అక్టోబరుకల్లా రూపొందించే అవకాశం ఉంది.

దక్షిణ-కోస్తా కొత్త రైల్వే జోన్
author img

By

Published : Apr 24, 2019, 8:56 AM IST

విశాఖ రైల్వే జోన్​ నిర్మాణం ప్రక్రియ మొదలైంది. ప్రాజెక్టు విషయమై ఓఎస్డీ ఎస్​. ఎస్​. శ్రీనివాస్​ తూర్పు-కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించారు. నేడు ఆయన దిల్లీలో రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. విధివిధానాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్​)ను అక్టోబరు కల్లా రూపొందించే అవకాశముందని సమాచారం.

డివిజన్​ల వారీగా సమాచార సేకరణ..
గుంతకల్లు, గుంటూరు, విజయవాడలతో పాటు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడే దక్షిణ-కోస్తా జోన్​లో.. తూర్పు- కోస్తాలోని వాల్తేరు డివిజన్​లో కొంత భాగాన్ని కలపనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వేలో ఇక సికింద్రాబాద్​, హైదరాబాద్​, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగలనున్నాయి. మరోవైపు దక్షిణ- కోస్తాలో వాల్తేరు కొనసాగిస్తూనే..తిరుపతిలో బాలాజీ డివిజన్​ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట కొత్త డివిజన్​గా కావాలని డిమాండ్​ వినిపిస్తోంది.
ఆస్తులు..ఆదాయం..ఖర్చులు రైళ్ల రాకపోకలు, నిర్వహణ ఏర్పాట్లు..సదుపాయాలపై డివిజన్ల వారీగా ఓఎస్డీ శ్రీనివాస్​ సమాచారం సేకరిస్తున్నారు. వాల్తేరుకు సంబంధించి సమాచార పక్రియ దాదాపు పూర్తైందని తెలుస్తోంది.

దక్షిణ-కోస్తా కొత్త రైల్వే జోన్​ ఏర్పాటుపై కసరత్తు

విశాఖ జోన్​ ఏర్పాటు కసరత్తు వేగవంతమైనందున..నూతన డివిజన్​లకు డిమాండ్​ పెరుగుతోంది. కాజీపేట విషయాన్ని కీలకంగా తీసుకునే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికారుల అభిప్రాయం. గుంటూరు డివిజన్​ సరిహద్దులూ మార్చేందుకు ప్రయత్నిస్తారని సమాచారం. ఇవన్నీ వేర్వేరు ప్రక్రియలని రైల్వే అధికారులుపేర్కొన్నారు.

ఇవీ చదవండి..జీఎస్​టీ కొత్త నిబంధనలు అనుకూలమే: క్రెడాయ్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.