అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు విశాఖపట్నం పోర్టు వెల్లడించింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు విశాఖపోర్ట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అవగాహన వారోత్సవాలకు శ్రీకారం చుట్టాయి. అప్రమత్త భారత్, సంపన్న భారత్ అనే థీమ్‌తో ఈ ఏడాది విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు చేపట్టనున్నారు.
పాలనలో క్రమబద్ధమైన పురోగతి, కొవిడ్ నిబంధనలు అనుసరించి, ప్రజల్లో అవగాహన, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు పోర్టు ముఖ్య విజిలెన్స్ అధికారి ప్రదీప్ కుమార్ వెల్లడించారు. ప్రధానంగా యువతలో నైతిక బాధ్యతను పెంపొందించటం, వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా పది కళాశాలల్లో విజిలెన్స్ ప్రతిజ్ఞ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి; నీరవ్ మోదీకి ఏడోసారి బెయిల్ నిరాకరణ