కృష్ణాపురంలో భూ సమీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు.. పనులను వెంటనే ఆపాలని ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. కొన్నేళ్ల కిందట సుమారు 13 ఎకరాల స్థలంలో కొంతమేర పట్టు పరిశ్రమ ఉండేదని.. అనంతరం రైతులకు ఉద్యాన పంటలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే వారని రైతులు తెలిపారు. రైతులకు ఉపయోగపడే పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్ల స్థలాల పేరిట ఖరీదైన భూములను తీసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని.. న్యాయపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: