ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొల్లగాని వెంకట కుమారి మొక్కలు నాటారు. విశాఖ నగరంలో పర్యావరణహితమైన వృక్షాలు పెంపుదలే లక్ష్యంగా కృషి చేస్తానని మేయర్ తెలిపారు. జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులు పాత్ర కీలకమైందన్నారు. రోజురోజుకు భూమిపై పచ్చదనం నశించిపోతుందని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చెట్టు తొలగించే ముందు.. దాని స్థానంలో ఐదు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ భూతం పర్యావరణానికి అడ్డంకిగా మారిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు. విశాఖ నగరంలో పలుచోట్ల గ్రీన్ బెల్ట్లు ఉన్నాయని.. వీటి నిర్వహణ ప్రజలు తమ బాధ్యతగా పాటించాలన్నారు.
ఇదీ చదవండి:
Environment day: భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలి: సీఎం