విశాఖ మన్యంలో గర్భిణీలకు అవస్థలు తప్పడం లేదు. తాజాగా జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ జీరుగులగొయ్య గ్రామంలో చిన్ను అనే నిండు గర్భిణికి నొప్పులు మెుదలవ్వటంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. గ్రామంలోకి అంబులెన్స్ వచ్చే రహదారి లేకపోవటంతో 4 కిలోమీటర్లు డోలీలో పులుసుమామిడికి తీసుకువచ్చారు. అక్కడనుంచి బైక్ అంబులెన్స్‌లో జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు. మహిళ పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేక డోలీ మోత తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: స్వచ్ఛ రిక్షాలకు చెదలు.. నిర్లక్ష్యంలో అధికారులు