ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వివిధ కమిటీలు తమ పరిశీలనలను రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీకి ఇస్తాయని, వాటిపైనే తదుపరి చర్యలు ఉంటాయని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ వెల్లడించారు. బాధిత గ్రామస్ధులందరికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించి క్రమపద్దతిలో రికార్డు నిర్వహణకోసం ప్రత్యేకంగా కార్డులు ఇస్తామన్నారు. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ నీటిని తుది నివేదికలు వచ్చే వరకు వినియోగించబోమని స్పష్టం చేశారు. కొవిడ్ కేసుల కోసం కంటైన్మెంట్ జోన్ల పరిధి... కేంద్రం నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని వివరించారు. రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం హాజరుకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే ఆయా విభాగాధిపతులను అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.
'కేంద్రం నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్ల పరిధి' - vishaka collector spoke corona news
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వివిధ కమిటీలు తమ పరిశీలనలను రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీకి ఇస్తాయని, వాటిపైనే తదుపరి చర్యలు ఉంటాయని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ వెల్లడించారు. కొవిడ్ కేసుల కోసం కంటైన్మెంట్ జోన్ల పరిధి... కేంద్రం నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.