విశాఖ నగరంలో నూతన సంవత్సర వేడుకలపై.. పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 సాయంత్రం 6గంటల నుంచి సాగరతీరంలో ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. యారాడ బీచ్ నుంచి భీమిలి తీరం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కేసులు పెడతామని సీపీ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు.
ఎలాంటి వేడుకలకూ అనుమతులు లేవని స్పష్టం చేశారు. రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు నిర్ణిత సమయాల వరకే తెరచి ఉంటాయని, హోటళ్ల పర్మిషన్లకు సంబంధించి.. ప్రభుత్వం సూచనల మేరకు వాటిని అనుమతిస్తామని అన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య పెరిగింది..
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య పెరిగిందని సీపీ తెలిపారు. మాదకద్రవ్యాల బారిన పడిన వారికి.. మార్పు, పరివర్తన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. దిశ కేసులకు సంబంధించి ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కేవలం 60 రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేసి చార్జిషీట్ వేస్తున్నామని తెలిపారు.
గంజాయి రవాణాను అరికట్టేందుకు.. ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా వేల ఎకరాలను ధ్వంసం చేశామన్నారు. సంచలనం సృష్టించిన అమెజాన్ ద్వారా గంజాయి సరఫరా కేసులో.. కీలక నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి:
TDP Dharna on OTS : ఓటీఎస్ కు వ్యతిరేకంగా.. విశాఖలో తెదేపా ధర్నా