విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్రప్రభుత్వం ప్రతిపాధించిన కాయకల్ప విభాగంలో అత్యుత్తమ సేవలకు గాను జిల్లాలో భీమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవార్డు వచ్చింది. ఈ అవార్డు కింద ఐదు లక్షల నగదును అందజేశారు. పచ్చదనం పరిశుభ్రత, రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే సేవలకుగాను ప్రథమ బహుమతి వచ్చిందని..వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పచ్చని మొక్కలతో నిండి మనసుకు ఉల్లాసాన్నిచ్చేలా తీర్చిదిద్దారు. ఆసుపత్రి ప్రహరీ గోడలపై రోగులు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు, నియమాలను రాశారు. ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి విషయాలు పట్ల రోగుల్లో అవగాహన కలిగేలా ఆసుపత్రి సిబ్బంది ఉంటారని సూపరింటెండెంట్ సిద్ధార్థ తెలిపారు.
ఇదీ చదవండి: 2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన రూ.300 కోట్లు