ETV Bharat / state

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం..నేటికి ఏడాది - ఏడాది పూర్తి చేసుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం

Vizag Steel plant movement: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా నేడు కూర్మన్న పాలెంలోని శిబిరం వద్ద 365 జెండాలతో నిరసన తెలపనున్నట్లు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి వెల్లడించింది. ఏడాది పూర్తైనప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో.. రేపు జైల్‌భరో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Vizag Steel plant movement
Vizag Steel plant movement
author img

By

Published : Feb 12, 2022, 7:44 AM IST

Updated : Feb 12, 2022, 7:56 AM IST

Vizag Steel plant movement: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా నేడు కూర్మన్న పాలెంలోని శిబిరం వద్ద 365 జెండాలతో నిరసన తెలపనున్నట్లు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ సమితి వెల్లడించింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త మద్దతు కూడగట్టామన్నారు. అయినా కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో..ఈ నెల 13 న జైల్‌భరో నిర్వహిస్తామని తెలిపారు.

అమ్మేస్తాం.. మూసేస్తాం అంటే చూస్తూ ఊరుకోం...

కరోనా కష్ట కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షల మందికి ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు అందిందని కార్మిక నేతలు చెప్పారు. పరిశ్రమ ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. అలాంటి పరిశ్రమను అమ్మేస్తాం, మూసేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగు ప్రజలు బానిసలు కాదని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని అన్నారు. కేంద్రం తన నిరంకుశ ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా కేంద్రం వెనక్కి తగ్గకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసనలు

Last Updated : Feb 12, 2022, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.