ఛారిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు పట్టకున్నారు. ఇండియాలోఛారిటీ కోసం రూ. 39 కోట్లని ఇస్తామంటూ ఓ ముఠా విశాఖ వాసి సంజయ్ సింగ్‌కి మెయిల్ పంపింది. ఫేక్ మెయిల్‌కి స్పందించి తన వివరాలను బాధితుడు అందించారు. నైజీరియన్ ముఠా వలలో చిక్కుకుని పన్నుల పేరుతో రూ. 6.62 లక్షలను 13 అకౌంట్లలో జమ చేశాడు. ఆ ముఠా స్పందించకపోవడంతో అనుమానంతో విశాఖ పోలీసులను సంప్రదించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నైజీరియన్ ముఠాని, మేఘాలయ రాష్ట్రానికి చెందిన మహిళను దిల్లీలో అరెస్ట్ చేశారు. విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వివరాలు వెల్లడించారు. నైజీరియన్ ముఠా నుంచి రూ. 55 వేల నగదు, రెండు లాప్‌ట్యాప్‌లు, ఆరు మొబైల్స్, ఏడు సిమ్‌లు, రెండు ఏటీఎంలు, పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుల బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.1.46 లక్షల నగదు సీజ్ చేసినట్టు చెప్పారు.
విశాఖలో ఆన్ లైన్ మోసం గుట్టు రట్టు - విశాఖలో ఆన్ లైన్ మోసం గుట్టు రట్టు
విశాఖలో ఆన్లైన్ మోసం గుట్టు రట్టయింది. ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్న నలుగురు నైజీరియన్లను, ఓ మేఘాలయ మహిళను దిల్లీలో అరెస్టు చేశారు.
![విశాఖలో ఆన్ లైన్ మోసం గుట్టు రట్టు visakha cyber crime police arrested nigerians](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5881449-811-5881449-1580284267934.jpg?imwidth=3840)