జూలై 8వ తేదీన 'పేదలందరికీ ఇల్లు' పథకాన్ని ప్రారంభించి అర్హులందరికీ పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఈ మేరకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ఇళ్ల పట్టాల పంపిణీకి అత్యంత ప్రాధ్యాన్యం ఇచ్చిందన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఇళ్ల స్థలాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈనెల 15వ తేదీ నాటికి కొత్తగా చేర్చిన లబ్ధిదారులకు ఇచ్చే స్థలాలు సిద్ధం కావాలన్నారు. జూలై 4వ తేదీ నాటికి లబ్ధిదారులకు లాటరీ ప్రకారం ప్లాట్లు కేటాయించడం జరగాలని ఆదేశించారు. ముందుగా మార్చి 25న పేదలందరికీ పట్టాలు మంజూరు చేసే ప్రక్రియ కరోనా మూలంగా వాయిదా పడటం వల్ల... వచ్చే నెల 8న ఈ పథకం ప్రారంభం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఆదుకోకుంటే.. ఆందోళనకు సిద్ధం'