విశాఖ జిల్లాలోని జీవీఎంసీ, మున్సిపాలిటీల్లో పని చేస్తున్న వాలంటీర్లు తమ అధికారిక సెల్ఫోన్లను తక్షణమే అప్పగించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అథారిటీ వి. వినయ్ చంద్ ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఫోన్లను ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ చేయాల్సి వస్తే మున్సిపల్ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారి సమక్షంలో ఫోన్ చేయవచ్చని స్పష్టం చేశారు.
వాలంటీర్లు ఎటువంటి అనధికారిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు చేపడుతామని హెచ్చరించారు. వాలంటీర్లపై ఫిర్యాదు కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 0891 2590100, మెయిల్ ఐడీ: drovskccc@gmail.com లకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు అందిన 12 గంటల్లోగా విచారణ చేపట్టడం జరుగుతుందని వివరించారు.
ఇదీ చదవండి