జీవో ఎంఎస్ సంఖ్య 21 ని వెంటనే రద్దు చేయాలని విశాఖ కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని సూర్యబాగ్ కూడలి వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. జీవో 21తో ఆటో కార్మికులకు అనేక సమస్యలు తలెత్తుతాయని విశాఖ ఆటో, రిక్షా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అప్పల్రాజు అన్నారు. కరోనా ప్రభావంతో ఏడు నెలలుగా కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం కన్నా పొరపాటున జరిగే తప్పిదాలకే ఎక్కువ జరిమానాలు చెల్లిస్తున్నామని తెలిపారు. వెంటనే జీవోను రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ఎడ్సెట్ 2020 ఫలితాల విడుదల