ETV Bharat / state

ఆర్థిక రాజధాని పేరిట విశాఖలో అరాచకాలు: వాసుపల్లి గణేశ్ - 3 capitals news

ప్రజా రాజధానిగా అమరావతి ఉంటేనే 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం హయాంలో విశాఖ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్​గా రూపుదిద్దుకుందని చెప్పారు. వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.

vasupalli ganesh
vasupalli ganesh
author img

By

Published : Aug 23, 2020, 5:50 PM IST

ఆర్థిక రాజధాని పేరిట విశాఖలో అరాచకాలు సృష్టిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఆక్షేపించారు. తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకే ఆర్థిక రాజధాని పేరిట డ్రామాకు తెరలేపారని అన్నారు. తెలుగుదేశం హయాంలో విశాఖ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్​గా రూపుదిద్దుకుందని వాసుపల్లి చెప్పారు.

ఎన్నికల ముందు మూడు రాజధానులపై వైకాపా ఎందుకు ప్రకటన చేయలేదని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక అనాలోచిత నిర్ణయాలతో అమరావతికి మరణ శాసనం రాస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు వైకాపా ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ప్రజా రాజధానిగా అమరావతి ఉంటేనే 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అమరావతితోనే సాధ్యమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

250వ రోజు రాజధాని పరిరక్షణ పోరాటం @ విభిన్నం.. వినూత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.