విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వల్లూరులో నిలిటో మెరెన్స్ ప్రాన్స్ కంపెనీ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. ఆ కంపెనీ వారు వ్యర్థాలను పొలాల్లోకి వదిలిపెడుతున్నారని ఆరోపించారు. సముద్రంలో పట్టిన రొయ్యలు తీసుకొచ్చి వాటిని ఈ సంస్థలో శుభ్రం చేసి ప్యాకింగ్ చేస్తుంటారు.
ఈ క్రమంలో వచ్చిన వ్యర్థాలను గ్రామ సమీపంలోని పొలాల్లో విడిచిపెట్టడం వల్ల దుర్వాసన వస్తోందంటూ స్థానికులు నిరసన తెలిపారు. తమకు అనారోగ్యం సోకే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు. అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: