విశాఖపట్నం జిల్లా కోటఉరుట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో విద్యుత్ కోతలకు నిరసనగా గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. సీపీఐ నాయకులు, మహిళలు కొవ్వత్తులతో రహదారిపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు పెంటకోట వెంకట స్వామి మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: