విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల జాతర ఘనంగా జరిగింది. ఎంపీ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్... స్వామి, అమ్మవార్లు కొలువైన రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీలు బుద్ధ నాగ జగదీశ్వర రావు, పి.చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, వైకాపా నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ దర్శించుకున్నారు.
జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యుత్తు కాంతులతో తీర్చిదిద్దిన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: