ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఆధ్వర్యంలో విశాఖలో రాజధాని అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించడంపై వేదిక సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి అన్ని వసతులు ఉన్నాయని నగర ప్రముఖులు కొనియాడారు. ఉత్తరాంధ్ర ప్రజా కవి వంగపండు ప్రసాద్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖను రాజధానిగా స్వాగతిస్తున్నామని, వెనకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని రాక సంతోషదాయకమని గీతాలతో ఆలపించారు.
ఇవీ చూడండి...