విశాఖ జిల్లా రోలుగుంట మండలం శరభవరం శివారు వైబీ పట్నం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక గిరిజనులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు... మహిళను దహనం చేసినట్లు గుర్తించారు. రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: