విశాఖ జిల్లా పాడేరు ఎక్సైజ్ కార్యాలయంలో కేసుల్లో ఉన్న వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలను.. కార్యాలయం వెనుక ఉన్న ఆవరణలో నిలిపి ఉంచారు. వీటిలో నిన్న మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా... వారు మంటలను అదుపు చేశారు. ఎక్సైజ్ సిబ్బంది సీసీ ఫుటేజ్ పరిశీలించగా చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తులు సంచరిస్తూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
నెల రోజుల కిందట కూడా ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో.. జీపును తగలబెట్టారు. సమీపంలోని వాహనాలను పక్కకు తీసి పెద్ద నష్టం జరగకుండా ఎక్సైజ్ సిబ్బంది ప్రయత్నించారు. రెండోసారి సైతం ఇలాగే జరిగిన కారణంగా... వాహనాలకు రక్షణ లేకుండా పోతోందని సిబ్బంది ఆందోళన చెందారు. కార్యలయం ముందు భాగంలో ఉండటం.. అధిక సంఖ్యలో వాహనాలను వెనుక ఆవరణలో నిలుపుదల చేయటం.. ఇలాంటి ఘటనలకు కారణం అవుతోందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: