ETV Bharat / state

ఏసీఏ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం - andhra cricket association

ఆంధ్ర క్రికెట్ సంఘం ఏసీఏ నూతన కార్యవర్గ పదవులకు పోటీ లేనందున ఏన్నికను ఏకగ్రీవంగా ఖరారు చేశారు. ఈ నెల 23న అధికారికంగా ఫలితం ప్రకటించనున్నారు.

ఏసీఏ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
author img

By

Published : Sep 21, 2019, 6:24 AM IST

Updated : Sep 21, 2019, 7:06 AM IST

ఏసీఏ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం

ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఏసీఏ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికారికంగా ఈనెల 23న ఫలితం ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో 6 పదవులకు గానూ.... ఆరుగురి నుంచి 9 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం... పదవులకు పోటీ లేనందున ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఖరారు చేశారు. ఏసీఏ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా వెంకటగిరి సంస్థానం క్రికెట్‌ క్లబ్‌కు చెందిన శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా యాచేంద్ర ఎన్నికయ్యారు.
కార్యదర్శిగా కృష్ణా జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన దుర్గాప్రసాద్‌, సంయుక్త కార్యదర్శిగా విజయవాడ వెల్కమ్‌ క్రికెట్‌ క్లబ్‌కు చెందిన రామచంద్రరరావు ఖరారయ్యారు. కోశాధికారిగా గుంటూరు న్యూ క్రికెట్‌ క్లబ్‌కు చెందిన గోపిననాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌గా గుంటూరు గోపరాజు ప్రసాద్‌ మెమోరియల్‌ క్రికెట్‌ క్లబ్‌కు చెందిన ధనుంజయరెడ్డి ఎన్నికయ్యారు.

Intro:20_tdp_kaaryalayam_lo_kodela_ku_santhaapasabha_avb_ap10170

నరసరావుపేట తెదేపా కార్యాలయంలో కోడెల కు సంతాపసభ.

నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడెల శివప్రసాదరావు కు సంతాపసభ కార్యక్రమాన్ని ఇంచార్జి చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి రాయపాటి శ్రీనివాసరావు, కోడెల బాబాయి కోడెల అబ్బయ్య, తెదేపా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

Body:కార్యక్రమంలో ముందుగా కోడెల చిత్రపటానికి రాయపాటి శ్రీనివాసరావు, చదలవాడ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నరసరావుపేట ఘనచరిత్రను రాష్ట్రవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కోడెలకే దక్కుతుందని అన్నారు. వైద్యవృత్తిలో ప్రజలకు చేరువైన కోడెల ఎన్ఠీఆర్ పిలుపుతో రాజకీయ రంగప్రవేశం చేసి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలకు అభివృద్ది ప్రదాత అయ్యాడని కొనియాడారు.

Conclusion:నరసరావుపేట తేదేపా ఇంచార్జి చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ కోడెల భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచివుంటాడాని అన్నారు. ముందు తరాలకు ఉపయోగకరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరికీ బాసటగా నిలిచారన్నారు. 43వేల కోట్లు దొంగతనం చేసి 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఈ రోజు పాలన చేస్తున్నాడని ఎటువంటి తప్పు చేయని గొప్ప వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చదలవాడ అన్నారు. దొంగలకు ఎటువంటి భయం వుండదని నిజాయితీ పరులు అపవాదులు మొయ్యలేరని అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. పాపం ఏరోజుకైనా పండుతుందన్నారు. కార్యకర్తలందరూ తనకు సహకరిస్తే కోడెల లేని లోటును తాను తీరుస్తానని కార్యకర్తలకు అరవింద బాబు భరోసానిచ్చారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
Last Updated : Sep 21, 2019, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.