Two School Auto Accidents in Visakhapatnam: విశాఖపట్టణం నగరంలో జరిగిన రెండు వేర్వేరు ఆటో ప్రమాదాలు.. రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్తున్న రెండు ఆటోలు ప్రమాదానికి గురికావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, అదృష్టవశాత్తూ రెండు ప్రమాదాల్లోనూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Two Auto Accidents In Visakha: విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద బుధవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న ఓ ఆటో అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. దాంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఘటన మధురవాడ-నగరం పాలెం రోడ్డులో జరిగింది. మధురవాడ నుంచి నగరంపాలెం వైపు వస్తున్న ఆటో పందిని ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురు మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
కడప ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం - ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు
Accident at Sangam-Sharat Theater Junction: ఉదయం సమయంలో ట్రాఫిక్ లేక విశాలంగా కనిపిస్తున్న రోడ్డు.. ఉత్సాహంగా ఆటోలో పాఠశాలకు వెళ్తున్న పిల్లలు.. రెప్పపాటు సమయంలోనే ప్రమాదానికి గురైన ఆటో.. రోడ్డుపై నిస్సహాయంగా పడిపోయిన చిన్నారులు.. ఈ విషాద ఘటన విశాఖపట్టణంలో బుధవారం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో సంగం-శరత్ థియేటర్ జంక్షన్ వద్ద అతివేగంగా వచ్చిన ఆటో.. లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టడంతో.. అందులోని పిల్లలంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు.. ఆటో కింద పడిన పిల్లలను బయటకు లాగారు. అదృష్టవశాత్తు పిల్లలెవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Students Injured in Auto Accident: ఈ ఘటనలో కొందరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. ముగ్గురు చిన్నారులు డిశ్చార్జి కాగా.. మరో ఐదుగురికి చికిత్స కొనసాగుతోంది. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అతివేగంగా ఆటో నడిపిన డ్రైవర్.. లారీని చూడకుండా వెళ్లడమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
Political Leaders Visited Hospital: ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కొండ్రు మురళి, గండి బాబ్జీ పరామర్శించారు. అనంతరం గాయపడిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Auto Overturned on City Palem Road: మరో ఘటన మధురవాడ ప్రాంతంలోని నగరంపాలెం రోడ్డులో జరిగింది. పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న మరో ఆటో బోల్తా పడింది. ఏడుగురు పిల్లలున్న ఈ ఆటో రోడ్డుపై పందిని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ప్రమాదంలో పిల్లలతో పాటు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే రోడ్లపై పందులు తిరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.