ETV Bharat / state

వైకాపా, తెదేపా పరస్పర దాడులు..ఇద్దరికి తీవ్ర గాయాలు - visakha district latest news

విశాఖ జిల్లా గుమ్మడికొండ గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. గ్రామంలో వైకాపా, తెదేపా వర్గీయులు పరస్పర దాడి చేసుకున్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ycp and tdp activists fight at visakha
వైకాపా, తెదేపా పరస్పర దాడులు
author img

By

Published : Apr 14, 2021, 8:43 PM IST

స్థానిక సంస్థల పోరు సందర్భంగా పలు గ్రామాల్లో ఏర్పడిన స్వల్ప విభేదాలు ఇంకా చల్లారలేదు. అదే రాజకీయ వేడితో వివాదాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే విశాఖ జిల్లా నాతవరం మండలం గుమ్మడికొండ గ్రామంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెదేపాకు చెందిన రాజబాబు, చిన అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లను వెంటనే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చూడండి:

వివేకా హత్య కేసు విచారణ.. పీఏను ప్రశ్నించిన సీబీఐ

గొలుసుకట్టు సంస్థలో డబ్బు రాలేదని ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.