ఆదివారం ఏవోబీలో పర్యటించడానికి వచ్చిన ఒడిశా డీజీపీ అభయ్ ఎదుట మావోయిస్టు ఏరియా కమిటీ నాయకురాలు సబిత(sabitha), మావోయిస్టు పార్టీ సభ్యుడు రాయథర్(raydhar) లు లొంగిపోయారు. మహిళా మావోయిస్టు సబిత పేరు మీద రూ.రెండు లక్షలు రివార్డు ఉండగా.. రాయథర్ పేరు మీద రూ. లక్ష రివార్డు ఉంది. చాలా కాలంగా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వీరు.. సంస్థలో వచ్చిన మార్పులతో మనస్తాపానికి గురై జనజీనస్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా మావోయిస్టులపై కరోనా ప్రభావం చూపడం కూడా దీనికి కారణమైంది. దీంతో వీరిరువురూ ఒడిశా డీజీపీ అభయ్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా.. ఏవోబీలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరాలని, అలా వచ్చే వారికి పోలీసుశాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఒడిశా డీజీపీ స్పష్టం చేశారు.
ఇదీచదవండి.