ETV Bharat / state

విశాఖలో చైన్​ స్నాచింగ్​ ముఠాల అరెస్ట్​ - vishakha latest news

నగర శివార్లు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న రెండు ముఠాలను విశాఖ పోలీసులు అరెస్ట్​ చేశారు. నగరానికి చెందిన ఐదు గురు సభ్యులు రెండు ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు నగర నేర విభాగాపు డీసీపీ వి.సురేశ్​ బాబు తెలిపారు.

two chain snatching groups arrested by vishakha crime police
విశాఖలో రెండు చైన్​ స్నాచింగ్​ ముఠాలు అరెస్ట్​
author img

By

Published : Sep 28, 2020, 5:25 PM IST

విశాఖలోని పలు చోట్ల చైన్ స్నాచింగ్​కు పాల్పడిన రెండు ముఠాలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఐదు గురు సభ్యులు రెండు ముఠాలుగా ఏర్పడి నగర శివార్లు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలలో నడిచి వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు నగర నేర విభాగాపు డీసీపీ వి.సురేశ్​ బాబు తెలిపారు.

గాజువాక, న్యూ పోర్ట్, 2టౌన్ పరిధిలో వరుసగా జరిగిన ఘటనలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. ఆదివారం సాయంత్రం గాజువాకలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా స్నాచింగ్​ వ్యవహారం బయటపడిందని డీసీపీ వివరించారు. ఇందులో ముగ్గురు బాల నేరస్థులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 124 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై వచ్చి అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ.. వెనక కూర్చున్న వ్యక్తి అదను చూసుకుని మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిపోతారు. మహిళలు ఒంటరిగా వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు.

ఇదీ చూడండి:

ఎంపీ విజయసాయిరెడ్డిపై సునీల్ దియోధర్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.