విశాఖ జిల్లా చీడికాడ, హుకుంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లో... కనీస రహదారి సౌకర్యాలు లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. చీడికాడ మండలం కోనాం ప్రాంతాన్ని ఆనుకుని చీడికాడ, పాడేరు, హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిలో చాలా గ్రామాలకు రహదారి సదుపాయం లేదు. చీడికాడ మండలం చెరుకుపల్లి వద్ద పెద్దగెడ్డ ఉంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ పెద్డగెడ్డ నిరంతరం నిండుగా ప్రవహిస్తుంది. ఆ నీరు కోనాం జలాశయంలోకి వెళ్తుంది. ఈ గెడ్డ అవతల చీడికాడ, హుకుంపేట మండలాలకు చెందిన గ్రామాలు ఉన్నాయి. చెరుకుపల్లి వద్ద పెద్దగడ్డపై వంతెన నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు తీర్చాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
పంటలు అమ్ముకోవాలంటే కోనాం గిరిజన వారపు సంతకు రావాల్సిందే. ఈ సంత ఒకటే మాకు ఆధారం. ఇక్కడ వంతెన లేక పదుల సంఖ్యలో గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. - వీరయ్య, హుకుంపేట
చెరుకుపల్లి వద్ద పెద్దగెడ్డపై వంతెన లేకపోవడం వల్ల ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. వర్షాకాలం వచ్చిందంటే మా అవస్థలు చెప్పనక్కరలేదు. ఈ మార్గమే.. మాకు ఆధారం ఇక్కడ వంతెన నిర్మిస్తే మా ఇబ్బంది తీరుతాయి. - రాజన్న, హుకుంపేట
ఏ కష్టం వచ్చినా గెడ్డ దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నాం. వర్షాకాలంలో మరింత ఇబ్బంది పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలి. - రాజు, చెరుకుపల్లి
ఇదీ చూడండి: