ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో డుడుమ జలపాతం ప్రాంగణం గిరిజన సంస్కృతి, సంప్రదాయ నృత్యాలతో సందర్శకులను మంత్రముగ్దులను చేసింది. కొరాపుట్ జిల్లాలో ఆదివాసీ కళలు, నైపుణ్యాలను వెలికి తీసేందుకు పరబ్ గిరిజన ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా గదాబా, దురువ గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేశారు. ఒడిశా చేనేతశాఖ మంత్రి పద్మిని దీయన్, కోరాపుట్ ఎంపీ పరబ్ జ్యోతి వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఈ ఉత్సవాలను చూడటానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
ఇదీ చదవండి: ఆ కానిస్టేబుల్ ఇల్లే.. ఓ మ్యూజియం!