పాడేరు ఏజెన్సీ కొయ్యూరు మండలం బురద రాళ్ల పంచాయతీ చౌడేపల్లి గ్రామంలో మొగ్గ వెంకట కుమారి ( 21 ) పురిటి నొప్పులతో బాధపడుతుంటే గ్రామస్థులు డోలి కట్టి రెండు కిలోమీటర్ల దూరంలోని సాకుల పాలెం గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి రాజేంద్రపాలెం కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రోడ్డు సదుపాయం లేక గిరిజన గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
ఇదీచూడండి