తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ విశాఖ జిల్లా మాడుగుల మండలం అజయపురం గిరిజన గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఊరికి అర కిలోమీటర్ దూరంలో బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని... ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైన్ వేసి కుళాయిను ఏర్పాటు చేయాలని కోరారు. కలుషిత నీరు తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి భవానీ, మైదాన గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి గిరిజనులతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పెరిగిన గ్యాస్ ధరలు.. సామాన్యులకు తప్పని తిప్పలు