ఆంద్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై స్థానిక గిరిజనులు మండిపడ్డారు. గాలింపు పేరిట అమాయక గిరిజనులను ఎత్తుకుపోయి వేధిస్తున్నారని, యువతులపై అత్యాచార కాండ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవలు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏవోబీలోని కటాఫ్ ఏరియాలో... సుమారు 6 పంచాయతీలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బహిరంగ సమావేశం నిర్వహించారు. కటాఫ్ ఏరియాకు వచ్చిన గాలింపు బలగాలు సిమ్లి పొదర్ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. గాలింపునకు వస్తున్న పోలీసు బలగాలు... గ్రామాల్లో యువతులు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై అత్యాచారాలు కూడా చేస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వైద్య సౌకర్యాలు, 108 వాహనాలను ఏర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల తీరుపై గిరిజనుల ఆగ్రహం - పోలీసుల తీరుపై మండిపడ్డ ఆంధ్రా ఒడిసా సరిహద్దులోని గిరిజనులు
ఆంద్రా - ఒడిశా సరిహద్దులో గల గిరిజనులు పోలీసుల ప్రవర్తనపై మండిపడ్డారు. గిరిజనులపై లేనిపోని ముద్రలు వేసి అరెస్టు చేస్తున్నారని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గాలింపు చర్యల్లో భాగంగా గ్రామాల్లోకి వచ్చిన పోలీసులు గ్రామ యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను తీర్చాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
ఆంద్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై స్థానిక గిరిజనులు మండిపడ్డారు. గాలింపు పేరిట అమాయక గిరిజనులను ఎత్తుకుపోయి వేధిస్తున్నారని, యువతులపై అత్యాచార కాండ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవలు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏవోబీలోని కటాఫ్ ఏరియాలో... సుమారు 6 పంచాయతీలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బహిరంగ సమావేశం నిర్వహించారు. కటాఫ్ ఏరియాకు వచ్చిన గాలింపు బలగాలు సిమ్లి పొదర్ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. గాలింపునకు వస్తున్న పోలీసు బలగాలు... గ్రామాల్లో యువతులు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై అత్యాచారాలు కూడా చేస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వైద్య సౌకర్యాలు, 108 వాహనాలను ఏర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'విశాఖ మన్యంలో డ్రోన్లతో నిఘా కట్టుదిట్టం'