సమాజంలో పెరుగుతున్న కీచక ఘటనలను ఎదుర్కొనేందుకు మహిళలు సన్నద్ధంగా ఉండాలని... మంత్రి పాముల పుష్ప శ్రీవాణి సూచించారు. విశాఖలోని గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆటల పోటీలు ప్రారంభించిన ఆమె... విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లోనూ ఆత్మరక్షణ కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు వెల్లడించారు. మహిళలు తమను తాము రక్షించుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చూడండి..గాజువాకలో వివాహితపై యాసిడ్ దాడి